సినిమాలలో నటించే హీరోలు సినిమాలలోనే కాకుండా బయట రియల్ హీరోస్ అనిపించుకున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వారు దైర్యం చేసి ముందుకొచ్చారు. పేద ప్రజలకు తోచిన సాయాన్ని అందించి ప్రజల మన్ననలను అందుకున్నారు. మరి కొందరు మాత్రం తోటి నటుడు చనిపోతే వారి కుటుంబ పోషణను తీసుకొని వారికి అండగా నిలుస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా మిగితా ఇండస్ట్రీలో కూడా పెద్ద మనసు చాటుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. 


ఇది ఇలా ఉండగా తమిళ్ చిత్రాలతో పాటుగా, తెలుగు చిత్రాలలో కూడా మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్న హీరో శివ కార్తికేయన్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు.తమిళ హాస్య నటుడు వడివేలు బాలాజీ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కోలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడివేలు బాలాజీ భౌతికకాయానికి విజయ్‌ సేతుపతి, రోబో శంకర్‌, దివ్య దర్శిణి తదితరులు అశ్రు నివాళులు అర్పించారు.ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 


వడివేలు బాలాజీ కి ఇద్దరు పిల్లలున్నారు. ఆ పిల్లల్ని చదివించేందుకు హీరో శివ కార్తికేయన్ ముందుకొచ్చారు. ఆ పిల్లలు ప్రయోజకులు అయ్యేవరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను భరిస్తానని శివ కార్తికేయన్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారితో పాటుగా, తమిళ అభిమానుల కూడా ఆయన మంచితనం పై ప్రశంసలు కురిపించారు.మదురైకి చెందిన బాలాజీ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా లో అవకాశం రావడంతో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వడివేలు పోలికలతో ఉండటంతో పాటుగా అచ్చు గుద్దినట్లు ఆయన లాగే చేయడంతో వడివేలు బాలాజిగా మారాడు. గత రెండు వారాల క్రితం ఆయనకు గుండెపోటు తో పాటుగా, పక్షవాతం కూడా వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. ఆర్థిక ఇబ్బందులతో ఒమండురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: