ఇక కొన్ని రోజుల తర్వాత బాలు మెల్ల మెల్లగా కొలుకుంటున్నాడని ఆయన కొడుకు తెలియజేయడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చాలా సంతోషించి, ఆయన త్వరగా మళ్ళీ తన గొంతుని వినిపించాలని ఆ దేవుడ్ని కోరుకున్నారు. ఇదిలా వుండగా సినీ ప్రముఖులు సైతం బాలు ఆరోగ్యం గురించి ఎంతగా ఆవేదన చెందుతున్నారో నటుడు శుభలేఖ సుధాకర్ తెలియజేశారు.ముఖ్యంగా హీరో బాలయ్య ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి ప్రతిరోజు ఫోన్ చేసి వాకబు చేస్తారట. బాలుగారికి ఎలా ఉందని అడిగి తెలుసుకుంటారట. అలాగే మీరు దిగులు పడకండి ఆయన ఖచ్చితంగా కోలుకుంటారని ధైర్యం చెవుతారట. దైవభక్తి మెండుగా ఉన్న బాలయ్య ప్రతి రోజు రెండు మూడు గంటలు పూజ చేస్తారట. ఆ పూజలో బాలు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తనకు చెప్పినట్లు శుభలేఖ సుధాకర్ తెలియజేశారు.
ఈ శుభలేఖ సుధాకర్ కూడా మరెవరో కాదు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి చెల్లెలి భర్త.వీరిది ప్రేమ వివాహం. ఇక తాజాగా సుధాకర్ కూడా బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని మన బాలకృష్ణ కి ఫోన్ ద్వారా వివరించేవారని ప్రస్తుత సమాచారం. ఇదిలా వుండగా ఇటీవలే విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల మన బాలయ్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి అండగా నిలిచి 10లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిచారు. మొత్తానికి మన బాలయ్య తాను అభిమానించే వ్యక్తుల పట్ల ఇంతలా పరితపిస్తుండడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.