పోయిన ఆదివారం చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు బిగ్ బాస్ 4. ఈ సారి కూడా ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించాడు నాగార్జున. లాస్ట్ మూడు సీజన్ల కంటే కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 4 ని చాలా రిచ్ గా మరియు సరి కొత్తగా లాంచ్ చేశారు. లాంచ్ అయినా మూడు రోజుల్లోనే చాలా బాగా పాపులర్ అయ్యింది. గొడవలు, అలకలతో ఎంతో ఉత్కంఠకు గురి చేస్తుంది. ఈ సీజన్.వీకెండ్‌ వస్తే… బిగ్‌బాస్‌ హౌస్‌ ఇంట్లో మజా షురూ అయినట్లే. మామూలుగా అయితే గత సిరీస్‌ల్లో ఇలా అనుకునేవారు. ఈ సారి అయితే ఏకంగా వీకెండ్‌ రావాలి… ఈ సుత్తి గోల పోవాలి అనుకున్నారు. అంతగా విసిగించేశాడు బిగ్‌బాస్‌.

‘కట్టప్ప’ అనే టాస్క్‌ పట్టుకొని జీడిపాకంలా సాగదీశాడు. పోనీలే వీకెండ్‌ వచ్చేసిందిగా వదిలేయండి. ఈ రోజు హౌస్‌ మేట్స్‌ను నాగ్‌ ఓ ఆట ఆడేసుకున్నాడు. ఈ రోజు రిలీజ్‌ అయిన ప్రోమోలను చూస్తే ఈ విషయం తెలిసిపోతోంది. తొలి ప్రోమోలో మోనాల్‌, అమ్మ రాజశేఖర్‌ పంచ్‌లు పడగా… కొత్త ప్రోమోలో నోయల్‌, సూర్యకిరణ్‌ వంతు వచ్చింది.నోయల్‌ ప్రతి విషయానికి ఓవర్‌గా ఆలోచిస్తాడు… ఇంట్లో వాళ్లే కాదు, బయట జనాలు కూడా అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని నాగ్‌ మరోసారి రెయిజ్‌ చేశాడు. ఎవరెవరు అలా అనుకుంటున్నారో చేతులెత్తండి అని నాగ్‌ అడిగాడు. దానికి అఖిల్‌, కళ్యాణి, సూర్యకిరణ్‌, దేవీ నాగవల్లి, లాస్య, అమ్మ రాజశేఖర్‌, దివి చేతులెత్తారు. అంటే ఏడుగురు అదే అనుకుంటున్నారు. ఈ లెక్క ఇక్కడితో ఆగిందా… లేక వేరెవరైనా అన్నారా తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఈ ప్రోమో టార్గెట్‌ సూర్యకిరణ్‌. అతని గురించి కూడా నాగ్‌ అందరూ అనుకునే టాపిక్కే అడిగారు. ‘నీకు అనవసరమైన వాటిల్లోకి వెళ్లి లెక్చర్లు ఇస్తున్నావ్‌’ అంటూ జనాల మాట అడిగేశారు. నువ్వు డైరక్టర్‌వి కాబట్టి… వాళ్లను క్యారెక్టర్‌/నటులు అనుకుంటున్నావా అని ఘాటుగా అడిగారు నాగ్‌.

ఇక శనివారం ఇంట్రెస్టింగ్‌ సీన్‌  మొదలైంది. నైబర్‌ హౌస్‌లో ఉండి వచ్చిన ఆరియానా, సోహైల్‌కు నాగ్‌ ఓ టాస్క్‌ ఇచ్చినట్లున్నాడు. కొన్ని ట్యాగ్స్‌ ఇచ్చిన ఏది ఎవరికి నప్పుతుందో ఇవ్వమన్నారు. ఆ క్రమంలో డస్ట్‌ బిన్‌ వచ్చింది. దీనిని ఇవ్వడానికి సోహైల్‌ అస్సలు ఆసక్తి చూపించలేదు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికో ఒకరికి ఇవ్వమంటే… దానిని అభిజీత్‌కి ఇచ్చింది ఆరియానా. ఇదంతా చూస్తుంటే అభిజీత్‌ను మరోసారి టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. వాళ్లిద్దరూ నైబర్‌ హౌస్‌ నుండి వచ్చినప్పుడు సిచ్యువేషన్‌ ఔటాఫ్‌ కంట్రోల్‌ అవ్వకుండా ఆపింది అభిజీతే. అందుకే ఆ ట్యాగ్‌ ఇచ్చి రౌండప్‌ చేసినట్లు కనిపిస్తోంది.

బిగ్ బాస్ 4 షో లో హీరోయిన్ మోనాల్ గజ్జర్,సైడ్ యాక్టర్  కరాటే కల్యాణి, యు ట్యూబర్ అలేఖ్య హారిక, గంగవ్వ, డైరెక్టర్ సూర్య కిరణ్, యు ట్యూబర్ మెహబూబ్ దిల్ సే, టీ వి 9 న్యూస్ రిపోర్టర్ దేవి, యాంకర్ అరియానా గ్లోరీ, సింగర్ అండ్ యాక్టర్ నోయల్ సీయోన్, యాంకర్ లాస్య, హీరో అభిజిత్, హీరోయిన్ దివి, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్, టీవీ యాక్టర్ అఖిల్ సార్థక్, టీవీ యాక్టర్ సోహెల్ తదితరులు బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: