ఆర్ఆర్ఆర్’లో సీనియర్ హాట్ హీరోయిన్ శ్రియ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఛత్రపతి’ తరవాత ఆమె యాక్ట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగణ్‌కి జోడీగా యాక్ట్ చేస్తున్నది. గెస్ట్ అప్పిరియరెన్స్ అంతే. అయితే… సినిమా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో శ్రియకు సీన్స్ లేవు. ఈ సంగతి ఆమె చెప్పింది. “దురదృష్టవశాత్తూ, తారక్, చరణ్‌తో యాక్ట్ చెయ్యలేదు. కానీ, సినిమాలో వాళ్ళిద్దరి క్యారెక్టర్లు గొప్పగా ఉంటాయని చెప్పగలను” అని శ్రియ చెప్పింది.
లాక్‌డౌన్‌కి ముందు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసింది శ్రియ. గెస్ట్ రోల్ కదా! కొన్ని రోజులు షూటింగ్ చేస్తే కంప్లీట్ అయ్యింది. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నానని శ్రియ చెప్పింది. రాజమౌళి, సినిమా గురించి మాట్లాడుతూ “రాజమౌళితో ‘ఛత్రపతి’ తరవాత వర్క్ చెయ్యడం గ్రేట్ ఫీలింగ్. ఆయన విజన్ గ్రాండ్‌గా ఉంటుంది. ఈసారి చాలా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం త్వరగా తగ్గిపోయి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని, త్వరగా సినిమా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నా” అని అన్నది.
ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ‘అంధాధున్’ రీమేక్‌లో టబు క్యారెక్టర్‌లో యాక్ట్ చెయ్యమని యూనిట్ అప్ప్రోచ్ అయ్యినట్టు శ్రియ చెప్పింది. సినిమాకు ఇంకా సంతకం చెయ్యలేదని అన్నది. టబు చేసిన రోల్ చెయ్యడం గొప్ప అదృష్టమని అన్నట్టు చెప్పింది. దీన్నిబట్టి సినిమాలో యాక్ట్ చెయ్యడం కన్ఫర్మ్ అని అనుకోవాలి. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు స్పెయిన్, బార్సిలోనా నుండి ఇండియా వస్తుందన్నమాట.