యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా రవితేజ తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. 50 ఏళ్ళు దాటినా రవితేజలో అదే ఎనర్జీ కనిపిస్తుంది. లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ లో పిక్స్ లీక్ అవగా వాటిలో రవితేజ మరింత అందంగా కనిపిస్తున్నారు. చేతిలో గొడుగు పట్టుకుని రవితేజ తన స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. గోపిచంద్ మలినేనితో ఆల్రెడీ డాన్ శీను, బలుపు సినిమాలు చేసిన రవితేజ ఈసారి క్రాక్ చూపించాలని చూస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు కిలాడి టైటిల్ పరిశీలనలో ఉందట. రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న రవితేజ క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. త్వరలోనే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని క్రాక్ షూటింగ్ పిక్ తన ఇన్ స్టాగ్రాం ద్వారా షేర్ చేశారు రవితేజ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.