అంతేకాదు నోయల్ ను పెళ్లాడుతా అంటూ గంగవ్వతో చిన్న స్కిట్ చేసింది. మెహబూబ్ కండల షోకి కోరస్ పాడింది. అఖిల్ తో ర్యాంప్ వాక్ చేసింది. ఇలా హౌజ్ లో 9వ రోజు హారిక తనకు ఇచ్చిన స్క్రీన్ స్పేస్ ను ఫుల్లుగా వాడేసిందని చెప్పొచ్చు. ఇక అభిజిత్ కు దగ్గరవ్వాలని చూస్తూ అతని మీద ప్రేమ చూపిస్తున్న హారిక అతనికి ఆకలిగా లేదు అన్న సమయంలో తినిపించడం లాంటివి కూడా చేస్తుంది. హౌజ్ లో కనెక్షన్స్ అంటూ జత చేసిన నాగార్జున హారికకు అభిజిత్ తో కనెక్ట్ చేశాడు.
కాని అభిజిత్ మాత్రం హారిక మీద కన్నా మోనాల్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడని తెలుస్తుంది. ఓ పక్క అఖిల్ కూడా మోనాల్ కు దగ్గరవుతున్నాడు. చూస్తుంటే హౌజ్ లో ఈ ముగ్గురు ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 9వ రోజు బిగ్ బాస్ ఇచ్చిన సీరియల్ టాస్క్ లో అందరు అదరగొట్టేశారు. ఇలాంటి టాస్కుల టైం లోనే తమ టాలెంట్ చూపించి ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు హౌజ్ మేట్స్.