దాదాపు 8 నెలలు ప్రజలు ఎలాంటి వినోదం లేకుండా గడిపారంటే అది కరోనా పుణ్యమే అని చెప్పొచ్చు.. మార్చి లో మొదలైన ఈ మహమ్మారి కారణంగా అప్పటినుంచి సినిమా ధియేటర్లు ఏవీ తెరుచుకోలేదు.. దాంతో సినిమా లన్నీ ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి..అయితే OTT ల రూపంలో సినిమాలకు మోక్షం వచ్చినా అన్ని తెలియని సినిమా లు రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు పెద్దగా ఇంటరెస్ట్ లేకుండా చేసుకున్నాయి.. ఒక్క నాని వి సినిమా తప్పా OTT లలో రిలీజ్ అయిన సినిమాలు ఏవీ ప్రేక్షకులకు పెద్దగా తెలియనివే..

అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ధియేటర్లు ఓపెన్ అవుతాయని చూస్తున్న ప్రేక్షకులకు ఓపెన్ కాకపోవడంతో OTT లలో సినిమాలే దిక్కు అయ్యాయి.. అయితే ఈ అక్టోబర్ లో భారీగా సినిమాలు OTT లో రిలీజ్ అవుతున్నాయి.. 2వ తేదీ ఆహా ద్వారా రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' రిలీజ్ అవుతుండగా,  అనుష్క 'నిశ్శబ్దం' , సుహాస్ హీరోగా రూపొందిన 'కలర్ ఫోటో,  సూర్య 'ఆకాశం నీ హద్దురా', రంగ్ దే, సోలో బ్రతుకే సో బెటరూ వంటి సినిమాలు OTT లలో ఈ అక్టోబర్ లో రిలీజ్ అవడానికి సిద్ధం అయ్యాయి..


ఒకవైపు థియేటర్లు వచ్చే నెల తెరుస్తారేమోనన్న సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే జనం మునుపటిలా వచ్చే అవకాశాలు, సీట్లు హౌస్ ఫుల్ చేసుకునే వెసులుబాటు లేవు కాబట్టి కొత్త సినిమాలు అంత ఈజీగా హళ్ళకు వచ్చేలా లేవు.  పైగా దసరా సీజన్ కావడంతో ప్రేక్షకులను కాష్ చేసుకోవడానికి OTT లు కూడా భారీ మొత్తం లో నిర్మాతలకు డబ్బు చెల్లించి సినిమాలని రిలీజ్ చేస్తుంది.. ఉప్పెన, రెడ్, అరణ్య, లవ్ స్టొరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వైల్డ్ డాగ్ తదితరరాలు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి.  ఇంకా మరికొన్ని పెద్ద సినిమాలు యా బాటలోనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో దియేటర్స్ ఓపెన్ కాకపోతే వాటిని కూడా ఇక్కడే రిలీజ్ చేయక తప్పదు..

మరింత సమాచారం తెలుసుకోండి: