ఆరెక్స్ 100 సినిమాతో టాలెంట్ చూపించిన కార్తికేయ ఆ సినిమాలో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా హిట్ తర్వాత వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని అందుకు తగినట్టుగా సక్సెస్ మాత్రం అందుకోవట్లేదు. 90 ml సినిమా థియేటర్ లో ఫ్లాప్ అవగా లాక్ డౌన్ వల్ల బుల్లితెర మీద మంచి రేటింగ్స్ తెచ్చుకుంది. ఆడియెన్స్ లో ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న కార్తికేయ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేస్తున్నాడు.  

గీతా ఆర్ట్స్ బ్యానర్ ట్విట్టర్ ఎకౌంట్ నుండి కార్తికేయకు సర్ ప్రైజ్ ట్వీట్ వచ్చింది. హలో కార్తికేయ మీ పుట్టినరోజు 21న అని తెలిసింది. ఈ బర్త్ డేకి మీరేమి కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.. ఏ వరం కావాలో కోరుకో నాయనా.. అని ట్వీట్ చేశారు. దానికి రిప్లైగా సానా థ్యాంక్స్ అండి.. మరి మన కుర్రాళ్ళంతా సల్లతి కబురు ఎప్పుడు చెబుతామా అని ఎదురుచూస్తున్నారు. వాళ్ళ సరదా కోసం బాలరాజు గాడి ఒక టీజర్ లాంటి ఏదైనా అంటూ రిప్లై ఇచ్చాడు.

ప్రస్తుతం కార్తికేయతో గీతా ఆర్ట్స్ బ్యానర్ జరిపిన ఈ ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువ హీరోల్లో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్న కార్తికేయ తన ప్రవర్తనతో అందరిని అలరిస్తున్నాడు.                                                          



మరింత సమాచారం తెలుసుకోండి: