పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి సినిమా తర్వాత టాలీవుడ్ లో మరొక సినిమా చేయలేదు. ఆ సినిమా అనంతరం రాజకీయ బాట పట్టి, సొంతంగా జనసేన పార్టీని స్థాపించి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉంటూ, ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు తన అభిమానుల కోరిక మేరకు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి త్వరలో వెండి తెరపై కనిపించడానికి రెడీగా ఉన్నాడు పవర్ స్టార్.


ఇక పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాా వకీల్ సాబ్. వేణు శ్రీరామ్సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా లో పవర్ స్టార్ లాయర్ గా కనిపించబోతున్నాడు. పవన్ కి జోడిగా తమన్నా నటిస్తుంది. అంతేకాదు ఆమెతో పాటు నివేదా థామస్, అంజలీ కూడా ఈ సినిమా లో కీలకమైన పాత్ర లు పోషిస్తున్నారు. ఇక ఇప్పడు తాజాగా ఈ సినిమాకు సంబందించి ఓ వార్త ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు 100 కోట్ల డిజిటల్ ఆఫర్ వచ్చిందట. అయినా కూడా నిర్మాత దిల్ రాజు పక్కన పెట్టారనే వార్త వినిపిస్తోంది.


మరో విషయం ఏమంటే.. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్.. పవన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర బృందం సెకండ్ సింగిల్ ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అతి తొందరలోనే ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇక లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. కాగా తాజాగా ప్రభుత్వం కొన్ని సడలింపులతో అనుమతులు ఇవ్వడంతో ఈ సెప్టెంబర్ చివరి వారం నుంచి మళ్లి షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: