ప్రియాంక చోప్రా.. సెప్టెంబర్ 18వ తేదీన 38వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అయితే ఫార్టీకి దగ్గరైనా పీసీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఈ హీరోయిన్ టాప్ లీగ్ లోనే కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటూ, ఏజ్ కి హీరోయిన్ కెరీర్ కి సంబంధంలేదని చాటుతోంది ప్రియాంక.
ప్రియాంక మొదట బ్యూటీ పెజెంట్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. మిస్ వరల్డ్ 2000 గా కిరీటం అందుకున్న, ప్రియాంక ఆ తర్వాత రెండేళ్ళకు వెండితెరపై మెరిసింది. సీనియర్ హీరోల నుంచి మొదలుపెడితే యంగ్ స్టర్స్ వరకు అందరితో రొమాన్స్ చేస్తోంది. షారుక్ ఖాన్ తో సినిమాలు చేసిన ప్రియాంక, షారుఖ్ ని చూసి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళతోనూ స్టెప్పులేసింది.
ప్రియాంక చోప్రా ఇంత లాంగ్ కెరీర్ ఎలా కంటిన్యూ చేస్తోంది అంటే కంటెంటే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఇక ఈ గ్లామర్ తో పాటు పీసీకి అందమైన హార్ట్ కూడా ఉంది. అందుకే యూనిసెఫ్ గుడ్ విల్ భ్రాండ్ అంబాసిడర్ గా చైల్డ్ రైట్స్ కోసం వర్క్ చేస్తోంది. అయితే మిసెస్ ప్రియాంకా జోనస్ గా మారాక హిందీలో సినిమాలు తగ్గించింది పీసీ. మరి రాబోయే రోజుల్లో అయినా ప్రియాంక బాలీవుడ్ కి వస్తుందా అనేది చూడాలి.
మొత్తానికి ప్రియాంకా చోప్రా పెళ్లయిన దగ్గర నుంచి సినిమాలు తగ్గించేసింది. హాలీవుడ్ కే ప్రియారిటీ ఇస్తోందన్న సంకేతాలు వచ్చేస్తున్నాయి. 40ఏళ్ల వయసుకు దగ్గరలో ఉన్న ఈ అమ్మడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.