తాజాగా మరో హాట్ హాట్ బ్యూటీ తనకు ఓ డైరెక్టర్ నుంచి ప్రమాదం ఉందని తనని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరింది. పాయల్ ఘోష్ .. ఈ పేరును తెలియని వాళ్ళు ఉండరేమో..సోషల్ మీడియా లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యింది. అయితే ఈమెకు ఓ డైరెక్టర్ వల్ల ఇబ్బందులు ఉన్నాయని తనని అతన్ని నుంచి కాపాడాలని భారత ప్రధాని మోదీ కి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయబోయాడని, నటి పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్ వ్యూ ఇచ్చినప్పుడు అతని పేరు బయట పెట్టలేదు. ఇప్పుడు అదే ఛానెల్ ద్వారా అనురాగ్ కశ్యప్ తనని బలవంతం చేయబోయిన సంగతిని బయటపెట్టింది. అనురాగ్ కశ్యప్ గురించి తెలుపుతూ.. భారత ప్రధాని నరేంద్రమోడీ సహాయం కోరింది. ఈ విషయంపై దృష్టి పెట్టి.. అనురాగ్ కశ్యప్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా ప్రధానిని కోరింది. అతను నన్ను బలవంతం చేయబోయాడు. అతడిని అరెస్ట్ చేసి అతని మొహాన్ని ప్రపంచానికి చూపించండి.ఇది నాకు హాని కలిగిస్తుందని, నా భద్రతకు ప్రమాదమని తెలుసు. దయచేసి సహాయం చేయండి.అంటూ మోదీని రిక్వెస్ట్ చేసిందీ.