బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో డార్లింగ్ తో రొమాన్స్ చేయబోతోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశ లో ఉంది. కానీ ప్రభాస్ మాత్రం ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో భారీ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రావుత్ దర్శకత్వంలో ప్రభాస్సినిమా చేస్తున్నాడు.


దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే రావడం జరిగింది. ఈ మూవీ కి ఆదిపురుష్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.ఇక ఈ సినిమా రామాయణ కథతో తెరకెక్కుతున్నట్లు ఇండియా హెరాల్డ్ నుండి సమాచారంఅందుతుంది.ఇకఇందులోఆదిపురుషుడిగా ప్రభాస్, శ్రీరామచంద్రుని పాత్రలో కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరడుగుల ఆజానుబాహుని సరసన ఆషామాషీ హీరోయిన్ ను కాకుండా ఏకంగా జూనియర్ మహానటిని పట్టుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.మహానటి సినిమాతో జాతీయ పురస్కారం పొందిన కీర్తి సురేశ్ అయితేనే సీత పాత్రకు ప్రాణం పోయగలదని దర్శకుడు ఓమ్ రౌత్ ఆలోచిస్తున్నాడు.


ఇక టీ-సిరీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఆదిపురుష్, 400 వందల కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటె కొన్ని రోజులుగా ఈ సినిమా లో సీత గా బాలీవుడ్ భామలు దీపికా, అనుష్క శర్మ ల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు చిత్ర బృందం మాత్రం కీర్తి సురేష్ అయితే సీత పాత్రకు సరిగ్గా న్యాయం చేస్తుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇదే కనుక నిజమైతే ఈ సారి సీతగా మన మహానటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.ఇక ఈ వార్తపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: