మొత్తానికి రెండున్నర ఏళ్ళ తర్వాత యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా ద్వారా ముఖానికి మేకప్ వేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ ఒక పవర్ఫుల్ లాయర్ గా కనిపించనున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా అంజలి, నివేదాథామస్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఎస్ఎస్ థమన్ స్వరపరచిన ఈ సినిమాలోని మగువ మగువ అనే సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన రాబట్టడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక భారీ పీరియాడికల్ మూవీలో కూడా నటిస్తున్నారు పవన్. దాని అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లోకల్ సినిమా అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరొక సినిమా కూడా చేయనున్నారు పవన్. ఇక ఈ సినిమాల అనంతరం ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పన్ కోషియమ్ అనే సినిమా తెలుగు రీమేక్ లో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్నట్లుగా కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా మా ఏపీ హాల్ సంస్థకు కొన్ని టాలీవుడ్ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయింది అనే వార్త వినపడుతోంది. దానికి కారణం ఇప్పటికే వరుస సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ వాటిని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని ఆ తర్వాతనే ఈ సినిమా యొక్క రీమేక్ విషయమై ఆలోచించాలని నిర్ణయించారట పవన్. మరి అసలు పవన్ ఈ సినిమా చేస్తారా లేదా అనేది పూర్తిగా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది.......!!