శ్రియా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరోయిన్ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.అలాంటి ఈ ముద్దుగుమ్మ  అగ్ర హీరోలతో కూడా నటించింది. సంతోషం, నువ్వే నువ్వే, నాకు నువ్వు నీకు నేను, సినిమాల నటించిన యూత్ కు బాగా దగ్గరైంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా బిజీ ఆర్టిస్టుగా కొనసాగింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా ముందున్న అంత జోష్  కనిపించలేదు.


ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుంది. గగనం, ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించబోతుంది.సినిమాల సంగతి పక్కన పెడితే రియల్ మాత్రం కాస్త  ఎక్కువ రొమాన్స్ తో ఎంజాయ్ చేస్తుంది.రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. మార్చి 2018 లో వీళ్ళ పెళ్లి జరిగినప్పటి నుంచి విదేశాల్లో ఉంటూ భర్తతో ఎంజాయ్ చేస్తుంది. కొత్త కొత్త ప్రదేశాలను చుట్టేస్తూ పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అలాంటి వీడియోలు పెట్టిన ప్రతిసారీ అమ్మడుకు నెటిజన్లు హాట్ కామెంట్లను అందించారు అయినా కూడా నా మొగుడుతో కదా అంటూ లైట్ తీసుకుంది.


ఇది ఇలా ఉండగా నిన్న ఈమె పుట్టిన రోజును జరుపుకుంది.38 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.స్పెయిన్‌లో తన భర్తతో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. పుట్టినరోజు సందర్భంగా భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను శ్రియ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.వాటిలో అమ్మడు భర్తకు లిప్ లాక్ చేసిన ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆండ్రీ నిజంగానే నక్కతోక తొక్కాడు. అందుకే ఇప్పుడు అడ్డు లేకుండా రొమాన్స్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు శ్రియా ఇన్స్టాల్ చక్కర్లు కొడుతున్నాయి.. ఎంత హాట్ ఉందో మీరే ఓ సారి చూసేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: