అయితే ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా ఒక బాలీవుడ్ సినిమా పే పర్ వ్యూ విధానంలో విడుదల కాబోతున్నది. ఈ సినిమా పేరు ఖాలీ పీలి కాగా... ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా లో ఇషాన్ కట్టర్, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ రెండో తారీఖున జీ ఫ్లెక్స్ లో భారత దేశ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ సినిమా చూడాలంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తమాషా ఏంటంటే ఇంకొక వంద రూపాయలు ఎక్కువగా ఖర్చు చేస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో సభ్యత్వం ఏడాదిపాటు ఉచితంగా లభిస్తుంది. ఒక్క అమెజాన్ ప్రైమ్ మాత్రమే కాదు ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సన్ నెక్స్ట్ వంటి ఎన్నో ప్లాట్ ఫామ్ ల ఏడాది కాలం పాటు సభ్యత్వం పొందవచ్చు. సో, వీటన్నిటిలో దేనికి సభ్యత్వం పొందిన వందలకొద్దీ సరికొత్త సినిమాలను ఉచితంగా వీక్షించవచ్చు. అయితే ఈ సినిమా ధరను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
కరోనా కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే మొట్టమొదటిగా పే పర్ వ్యూ అనే విధానాన్ని అనుసరించారు కానీ పైరసీ సైట్ల కారణంగా అది అంతగా విజయవంతం కాలేదు. దాంతో చాలామంది పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాలను విడుదల చేయడానికి సాహసించలేదు. ఇకపోతే మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదల అయ్యింది.