
పెళ్ళి తరువాత కూడ సమంత సోషల్ మీడియాలో మరింత సందడి పెంచి తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ తన ఇమేజ్ మరింత పెంచుకుంటోంది. ఈవిషయంలో తనకు నాగచైతన్యకు చిన్న అభిప్రాయభేదం ఉన్నట్లు సమంత స్వయంగా చెప్పడం ఇప్పుడు హాట్ న్యూస్.
సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు మరియు వీడియోలు షేర్ చేసే విషయంలో తమ ఇద్దరి అభిప్రాయాలు వేరు అంటూ సమంత కామెంట్ చేసింది. తన వ్యక్తి గత ఫొటోలను ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసే అలవాటులో ఆఫొటోలో పొరపాటున ఫ్రేమ్ లోకి చైతూ వస్తే ఆ ఫొటోలను షేర్ చేయడానికి చైతన్య ఒప్పుకోడు అన్నవిషయాన్ని సమంత బయటపెట్టింది. అంతేకాదు తాను ఒకవేళ అలాంటి ఫోటోలను పోస్ట్ చేసినా వెంటనే డిలీట్ చేయమని అంటూ ఉంటాడని ఈవిషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ తమ అభిప్రాయాలు ఒకటే అని సమంత చెపుతోంది.
అంతేకాదు చైతన్య ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆనిర్ణయం తాను కూడ మార్చలేనని కామెంట్ చేసింది. ‘మజిలీ’ తరువాత మరో సినిమాలో నటించే విషయం పై మాట్లాడుతూ సిల్వర్ స్క్రీన్ పై తమ జంటకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని దానిని అపురూపంగా కొనసాగించాలి కాని అస్తమానం అదే ప్రయోగం రిపీట్ చేస్తే క్రేజ్ ఉండదని సమంత అభిప్రాయం. తెలుగులో కూడ మంచి కథ దొరికితే వెబ్ సిరీస్ లో నటించే ఉద్దేశం ఉంది అని సమంత చెపుతున్న అభిప్రాయాలను బట్టి మరికొంతకాలం ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగే అభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..