మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి రెండు రీమేక్స్‌కు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు? ఈ ప్రశ్న అభిమానులకే అర్థం కావడంలేదు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన లూసిఫర్... అజిత్ యాక్ట్ చేసిన తమిళ మూవీ 'వేదళం' రీమేక్‌లో చిరంజీవి నటించనున్నాడు. ముందుగా వేదళం రీమేక్‌లో నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు చిరంజీవి. మెహర్ రమేశ్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశాడు. వెంకటేశ్‌తో షాడో తీసిన ఏడేళ్ల తర్వాత మెహర్ మరోసారి మెగాఫోన్ పడుతున్నాడు.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటున్నాడు. ఆచార్యలో లెక్చరర్‌గా.. నక్సలైట్‌గా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వేదళం రీమేక్‌లో రౌడీగా కనిపించనున్నాడు. గతంలో స్టేట్ రౌడీగా నటించిన మెగాస్టార్ చాలాకాలం తర్వాత రౌడీగా రఫ్పాడించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక లూసిఫర్ రీమేక్‌లో మినిస్టర్ అవతారం ఎత్తుతాడు చిరంజీవి. సినిమాలో తండ్రి ముఖ్యమంత్రి కాగా.. చిరంజీవి మినిస్టర్ గా వెనకనుండి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. గతంలో వచ్చిన ముఠామేస్త్రిలో చిరంజీవి మంత్రిగా కనిపించాడు. రీల్ లైఫ్‌లోనే మినిస్టర్ పోస్ట్ చూసిన చిరు రీల్ లైఫ్‌లో మరోసారి మినిస్టర్ కానున్నాడు. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సైరా.. ఆచార్య అంటూ.. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్న చిరంజీవి మనసు ఉన్నట్టుండి మంత్రి పదవిపై పడింది. 40 శాతం పూర్తయిన ఆచార్య షూటింగ్‌ను దసరా తర్వాత మొదలు పెట్టి ఏప్రిల్ లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు చిరంజీవి. ఆ తర్వాత వరుస రీమేక్స్‌తో బిజీ.
మొత్తానికి చిరంజీవి లూసిఫర్ లో మంత్రిగా తన పాత్ర నిర్వర్తించనున్నాడు. పరిపాలనలో తన భాగస్వామ్యం చూపి.. తన మార్క్ ఏంటో ప్రదర్శించనున్నాడు. ఈ సినిమాపై ఆయన అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.