రౌడీ హీరో విజయ్ దేవరకొండ అమ్మ గారు మాధవి జన్మదినాన్ని కుటుంబ సభ్యులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. అది కూడా 50వ పుట్టినరోజు కావడంతో అమ్మ అర్థ సెంచరీ కొట్టారని విజయ్ దేవకొండ, ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ పుట్టినరోజు వేడుకలో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. కాగా ఈ ఫ్యామిలీ పార్టీలో హీరోయిన్ రష్మిక కనిపించి అందరినీ షాక్ కి గురిచేసింది. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాల్లోకి వెళితే...

కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఫ్యామిలీ పార్టీకి పరిశ్రమకు చెందిన రశ్మికను మాత్రమే ఆహ్వానించడం వెనుక ఆంతర్యం ఏమిటని అందరూ అనుకుంటున్నారు. అప్పట్లో రష్మిక మందాన దేవరకొండ మధ్య ఎదో నడుస్తుందని కథనాలు వచ్చాయి. గీత గోవిందం తరువాత దగ్గరైన ఈ జంట, డియర్ కామ్రేడ్ మూవీ తరువాత ప్రేమికులుగా మారిపోయారని పుకార్లు రావడం జరిగింది. ఈ వార్తలపై రష్మిక స్పందించారు కూడా. విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంపై మాట్లాడిన దాఖలాలు లేవు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ రిలేషన్ చూసిన తర్వాత మాత్రం వీరు ప్రేమికులు అయ్యే అవకాశం కలదని అందరూ భావిస్తున్నారు. తాజా సంఘటనతో ఈ పుకార్లకు బలం చేకూర్చినట్లు అయ్యింది. గతంలో కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టిని ఘాడంగా ప్రేమించి, పెళ్లి అనగా సెండ్ ఆఫ్ చెప్పేసింది రష్మిక.

ఇక ఈ ఏడాది లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ, అలాగే నితిన్ తో భీష్మ సినిమాలు చేసి టూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టింది రష్మిక. ప్రస్తుతం సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప లో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: