యస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారి క్రెడిట్ ని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ లు తీసుకున్నారట వారు ఎవరు.. ఎందుకు తీసుకున్నారు.. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాలు చూసినట్లయితే..  సుధా చంద్రన్ నటించిన తెలుగు సినిమా ‘మయూరి’కి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించారు. హిందీలో ఆ సినిమాను ‘నాచే మయూరి’గా రీమేక్ చేసినప్పుడు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ద్వయం మ్యూజిక్ చేశారు. తెలుగులో ఆరు పాటలు వుంటాయి. హిందీలోనూ ఆరు పాటలు వుంటాయి. ఎస్పీ బాలు స్వరపరిచిన పాటలను తీసుకోకుండా ఐదు పాటలను కొత్తగా చేశారు. టైటిల్ సాంగ్ మాత్రం బాలూ చేసిందే కావాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోరడంతో అదే బాణీని హిందీలో వాడారు.

తెలుగులో ‘మయూరి’ టైటిల్ సాంగ్ ‘ఈ పాదం ఇలలోని నాట్యవేదం…’ను శైలజ పాడారు. హిందీలో ఆ స్వరానికి ఆనంద్ బక్షి లిరిక్స్ రాశారు. అదే ‘పగ్ పాదం సంగీత్ గీత్ సర్గం’. దానిని జానకి పాడారు. హిందీ పాటను సైతం బాలు రికార్డు చేయించారు. చెన్నైలో మళ్ళీ ఆర్కెస్ట్రేషన్ చేశారు. హిందీ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాలు చేశారు. దానికి టైటిల్ కార్డులో క్రెడిట్ ఇచ్చారు కాని టైటిల్ సాంగ్ చేసింది బాలూయే అని క్రెడిట్ ఇవ్వలేదు. అసలు విషయం తెలియని వాళ్ళు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఆ పాట చేశారని భావించారు.
ప్రతి సంవత్సరం సంప్రదాయ సంగీతం, నృత్యానికి సంబంధించి అవార్డులు ఇచ్చే ‘సుర్ సింగార్’ సంస్థ సైతం ‘పగ్ పాదం సంగీత్ గీత్ సర్గం’ పాటను లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరిచారని భావించారు. ఆ పాటను బెస్ట్ క్లాసికల్ సాంగ్‌గా ఎంపిక చేసి… గాయనిగా జానకికి, మ్యూజిక్ డైరెక్టర్లుగా లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌కి అవార్డులు ఇచ్చారు. ఆ పాటను స్వరపరిచినది ఎస్పీ బాలు అని వాళ్ళు చెప్పలేదు. ఏం మాట్లాడకుండా స్టేజి ఎక్కి అవార్డు పుచ్చుకున్నారు. బాలూకి రావాల్సిన క్రెడిట్ కొట్టేశారు. పాట పాడిన ఎస్. జానకికి అసలు విషయం తెలుసు కనుక ఆవిడ స్టేజి మీద చెబుతానని బాలూతో అంటే… ఆయన వద్దని వారించారు. తనకు రావాల్సిన అవార్డును గొప్ప సంగీత దర్శకులు పుచ్చుకోవడం గర్వంగా భావిస్తానని మౌనంగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: