ఘంటసాలకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాయిస్ ఎలా నప్పిందో..  ఆ తరం నుంటి నేటి తరం హీరోల వరకూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు సూటవడం అందరికీ సాధ్యమయ్యే పనేనా. అది వన్ అండ్ ఓన్లీ ఎస్బీబీ మిమిక్రీ  మ్యాజిక్ కాక మరేమిటి. అనుకరణ ప్రతిభతో  పెద్ద హీరోల దగ్గర నుంచి హాస్య నటులదాకా అందరికీ ప్లేబాక్‌ సింగర్‌  బాలూనే. అల్లు రామలింగయ్య, రాజబాబు, మాడా  ఇలా ఎలాంటి నటుడైనా సరే, ఎస్పీబీ గొంతు వారి వారి పాటలకు  సరిగ్గా సరిపోయేది.

చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో.. ఇది ఎన్టీయారే పాడినంత గంభీరంగా ఉంటుంది. వందనం అభివందనం .. నీ అందమే ఒక నందనం .. ఇది ఏఎన్నారే పాడిట్టుగా అనిపిస్తుంది. ఇదిగో తెల్లచీర, ఇవిగో మల్లెపూలు ...ఈ సాంగ్ కృష్ణే పాడారా అన్నట్టుగా ఉంటుంది. నాకొక శ్రీమతి కావాలి.. నీ అనుమతి దానికి కావాలి.. ఇది వింటే శోభన్ బాబే స్వయంగా  టీజింగ్ చేసినట్టుగా లేదు. మనసు ఒక మందారం.. చెలిమి తన మకరందం...ఈ గీతం కృష్ణంరాజే ఆలపించినట్టుగా అనిపిస్తుంది.  ముత్యాలు వస్తావా..అడిగింది ఇస్తావా..ఈ పాట అల్లు రామలింగయ్య కాకుండా ఎవరో పాడారంటే నమ్మబుద్ది అవుతుందా ?  సూడు పిన్నమ్మ..పాడు పిల్లాడు.. అంటూ మాడా పాడుకున్న పాట.. ఎవరు పాడిఉంటారు ? నమ్మకు నమ్మకు ఈ రేయిని.. అరె కమ్ముకువచ్చిన ఈ హాయిని.. ఇది చిరంజీవి కాకుండా వేరే ఎవరైనా ఆలపించినట్టు అనిపిస్తుందా ? రాళ్లల్లో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు.. ఇది కాలేజ్ డేస్ లో బాలకృష్ణ పాడుకున్న ప్రేమగీతం అనిపిస్తుంది. నేనే నేనే .. నేనే హీరో.. అంటూ వచ్చే పాట వింటే యువసామ్రాట్ నాగార్జున గొంతు తప్ప ఇంకెవరిదైనా గుర్తుకు వస్తుందా ? అన్నుల మిన్నుల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు లే.. అంటూ అమాయకంగా వినిపించే గొంతు వెంకటేష్ దే అనిపించదా ? ఇక తొలిప్రేమలో నా మనసే...సే .. సే అంటుంటే.. పవన్ కల్యాణ్ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది.  వద్దులే ప్రాణమూ నీవు రానప్పుడు " - మహేష్ బాబు అంత స్వీట్ గా  ఉంటుంది వాయిస్.

పలు భాషల్లోని కధానాయకులకు తగ్గట్టు గొంతు మార్చి పాడటం ఒక్క బాలుకే దక్కింది.  ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మొదలు ఈ తరం ఈహీరోల వరకూ వారి గొంతులకు అనుగుణంగా పాటులు పాడటం తనకే సాధ్యమని నిరూపించారు ఎస్పీబీ.

మరింత సమాచారం తెలుసుకోండి: