ఈ సినిమా నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ఓ పురాతన కోట కహానిలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నాని పాత్ర హైలెట్ గా ఉంటుందట.. పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని అంటున్నారు. నాని ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా ఓ లెక్క అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ రోల్ లో అలరిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, రష్మిక ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో వారి పాత్రలు కూడా అలరిస్తాయని అంటున్నారు.
నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెబుతున్నారు. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. అంతేకాదు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాని చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సినిమా అంచనాలకు తగినట్టు ఉంటే మాత్రం తప్పకుండా నాని రేంజ్ ను పెంచే సినిమా శ్యామ్ సింగ రాయ్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.