విజయ్‌ దేవరకొండ ఏమని పాన్‌ఇండియాలోకి అడుగుపెడుతున్నాడో చాలా మారిపోయాడు. ఇప్పుడీ రౌడీ రేంజ్ ఓ స్థాయిలో ఉంది. నిన్నటివరకు కిందే చూసిన విజయ్‌.. ప్రస్తుతం పైన మాత్రమే చూస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్సులిచ్చి పైకి తీసుకురావడంలో విజయ్‌కు మంచి పేరుంది. నిన్నటివరకు డెబ్యూ డైరెక్టర్స్‌నే నమ్ముకున్న విజయ్‌ ప్రస్తుతం స్టార్స్‌ వెంట పడుతున్నాడు. 2022లో సుకుమార్‌ డైరెక్షన్‌లో విజయ్‌ సినిమా కన్ఫార్మ్‌ అయింది.

ఎవరూ ఊహించని విధంగా విజయ్ దేవరకొండ, సుకుమార్‌ కాంబినేషన్‌ సెట్‌ అయింది. 2022లో మొదలయ్యే ఈ మూవీని ఫాల్కాన్‌ క్రియేటర్స్‌ పతాకంపై.. కేదార్‌ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు. నిర్మాత బర్త్‌డే సందర్భంగా ఈ కాంబినేషన్ ఎనౌన్స్‌ చేశారు. సుకుమార్‌ బన్నీతో తీస్తున్న పుష్ఫ మొదలుకావాల్సి వుంది. పూరీ సినిమా పూర్తికాగానే.. నిన్నుకోరి, మజిలీ వంటి హిట్స్‌ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నాడు విజయ్‌. శివ పెద్ద హీరోలను డైరెక్ట్‌ చేయకపోయినా.. వరుస హిట్స్‌తో క్రేజీ ఇమేజ్‌ దక్కించుకున్నాడు.

స్టైలిష్‌ లుక్‌కు ష్యాషన్‌కు రౌడీ హీరో కేరాఫ్‌ అడ్రస్‌. కథలోనే కాదు.. లుక్‌లో డిఫరెంట్‌గా కనిపించాలనుకుంటాడు. ఇక సుకుమార్‌ సంగతి సరేసరి.. స్టైలిష్‌ ఫిలిం మేనర్‌గా మంచి పేరుంది. ఇలా ఇద్దరు స్టైలిష్‌ స్పెషలిస్ట్‌లు కలిస్తే.. ఆ సినిమా ఎలా ఉంటుందో ఇప్పటినుంచో ఊహించుకుంటున్నారు అభిమానులు. సోషల్ మీడియా  వేదికగా  విజయ్‌దేవరకొండ స్పందిస్తూ.. ‘‘నాలో ఉన్న నటుడు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సంబరాలు చేసుకుంటున్నాడు. ఇదొక గుర్తుండిపోయే సినిమా అవుతుందని హామీ ఇస్తున్నా.. సుక్కు సర్‌.. మీతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నా’’అంటూ సంతోషం వ్యక్తం చేశాడు విజయ్‌దేవరకొండ.

విజయ్‌ దేవరకొండ సినీ ప్రస్థానం డెబ్యూ హీరోలతో మొదలైంది. విజయ్‌ కొద్దోగొప్పో గుర్తుండే పాత్ర పోషించిన మూవీ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఈ మూవీతో నాగ అశ్విన్‌ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. ఆతర్వాత దర్శకుడు మహానటి వంటి అద్భుతం సృష్టించి  స్టార్స్‌ జాబితాలోలో చేరిపోయి.. ప్రస్తుతం ప్రభాస్‌, దీపిక జంటగా సైంటిఫిక్‌ ఫిక్షన్‌ను  డైరెక్టర్‌ చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: