కరోనా  వైరస్ సంక్షోభం సమయం లో తన పెద్దమనసు  చాటుకుంటూ ఆపద్బాంధవుడి గా మారిపోయాడు సోను సూద్. కార్మికుల పాలిట దేవుడిగా... కష్ట  సమయం లో ఆదుకున్న ఆపద్బాంధవుడు... సోను సూద్ తన గొప్ప మనసున్న చాటుకున్నాడు. కేవలం వలస కార్మికులకు మాత్రమే కాదు.. దేశంలోని ఎంతోమంది నిరుపేదల కు సహాయం చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది విద్యార్థుల కు కూడా చేయూతనిచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో సోను సూద్ గొప్ప మనసుకి దేశ ప్రజానీకం మొత్తం ఫిదా అయిపోయింది.




 సోను సూద్ తాజాగా మరో గొప్ప పని చేశారు. గ్రీన్ చాలెంజ్ స్వీకరించి  మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తం గా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభించారు. ఇక ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్ లో  భాగంగా ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు మూడు మొక్కలు నాటడం తో పాటు ఇతరుల ను కూడా మొక్కలు నాటాలి అంటూ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే.




 ఈ క్రమం లోనే ప్రముఖ నటుడు స్వచ్ఛంద సేవకుడు సోను సూద్ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్ ను  స్వీకరించిన సోనూ సూద్.. మొక్కలు నాటినట్లు  తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోల ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జోగినిపల్లి సంతోష్ మొదలు పెట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణ కు ఎంతగానో ఉపయోగ పడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలి అంటూ పిలుపునిచ్చారు సోనూ సూద్.

మరింత సమాచారం తెలుసుకోండి: