అనీల్ రావిపుడి డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 సంక్రాంతికి సూపర్ ఎంటర్టైనర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ టైం లోనే సీక్వల్ ఎనౌన్స్ చేశాడు డైరక్టర్ అనీల్. ఆ సీక్వల్ లో కూడా వెంకీ, వరుణ్ ఉంటరని కన్ఫాం చేశాడు. అయితే ఎఫ్-2 లో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఎఫ్-3 లో ముగ్గురు హీరోలు ఉంటారని అంచనా వేశారు. సినిమాలో మరో స్టార్ హీరోని నటింపచేయాలని అనుకున్నారు కాని మళ్ళీ ఎందుకో వెనక్కి తగ్గారు.
ఎఫ్-3 లో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా రవితేజ కూడా నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి కాని ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. రవితేజ దగ్గరకు ఎఫ్-3 ఆఫర్ వెళ్ళిందట కాని అతని పాత్ర నచ్చక మాస్ రాజా ఈ సినిమా చేయనని చెప్పాడట. అయితే అనీల్ మాత్రం ఈ సినిమాలో రవితేజ ఉంటే ఎక్స్ ట్రీ ఎనర్జీ ఉంటుందని రవితేజ పాత్ర కూడా కొద్దిగా పెంచినట్టు తెలుస్తుంది. సో ఎఫ్-3లో రవితేజ కూడా ఉండే ఛాన్సులు ఉన్నాయని టాక్. వెంకటేష్, వరుణ్ తేజ్ లకు తోడుగా రవితేజ ఎనర్జీ కూడా తోడైతే ఆ లెక్క వేరేలా ఉంటుంది.
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నక్కిన త్రినాథ రావు కూడా రవితేజతో సినిమాకు రెడీగా ఉన్నాడు. మరి ఇన్ని కమిట్మెంట్స్ మధ్యలో ఎఫ్-3లో మాస్ రాజా ఉంటాడా లేదా అన్నది త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.