
ఇంటిలోని సభ్యులు కొందరు అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకున్నారని, అది కూడా వారు సేవ్ కావడానికి ఒక కారణం అన్నారు. తెలుగు మాట్లాడడం రాకపోయినా మోనాల్ ఎలిమినేషన్ నుండి ప్రతిసారి ఎలా సేవ్ అవుతున్నారని ప్రశ్నించారు. హౌస్ లో తనతో కూడా కొందరు అలాంటి రిలేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేశారని, అందుకు నేను ఇష్టపడలేదు అన్నారు. నిజంగా నా నుండి అలాంటి కోణం ఆశిస్తే హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదని దేవి చెప్పుకొచ్చారు.
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన మాజీ భర్త అమెరికాలో ఉన్నట్లు చెప్పారు. కుటుంబంతో కలిసి అతను అక్కడ సెటిల్ అయ్యారని చెప్పారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని దేవి చెప్పడం విశేషం. తనను, తన ఆరేళ్ళ కొడుకు కార్తికేయను అంగీకరించి పెళ్లి చేసుకుంటాను అంటే, దానికి తాను సిద్ధం అని చెప్పారు. అయితే కొడుకు ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది తెలియదు అన్నారు. ఇక గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన దేవి నాగవల్లి బిగ్ బాస్ నాలుగవ సీజన్ మూడవ వారంలో ఎలిమినేట్ అయ్యింది.