గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్వర్గస్తులయ్యారు కానీ సంగీతం ఉన్నంత వరకు బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ మన హృదయాల్లో బతికే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే బాల సుబ్రహ్మణ్యం జీవితం నుండి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 5 ముఖ్యమైన విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. బాలు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండేవారు. ఒక్క సంగీతం గురించి మాత్రమే కాదు ప్రతి విషయం గురించి చాలా శ్రద్ధగా నేర్చుకునే వారు. అందుకే అతనికి ఏ విషయమైనా వెంటనే అర్థం అయ్యేది.

2. తనకి కలిసిన ప్రతి ఒక్కరి పేర్లను గుర్తు పెట్టుకోగలరు బాలసుబ్రమణ్యం. ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన వ్యక్తులను కూడా పేర్లతో పిలిచి వారిని ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి బాలసుబ్రహ్మణ్యం తన చిన్నప్పటి స్నేహితులు అందరిని తనతోనే ఉండిపోయేలా చేశారు. సినిమా పరిశ్రమలో లేదా టీవీ పరిశ్రమలో తన స్నేహితులు అందరికీ ఉద్యోగాలు, అవకాశాలు ఇప్పించి వారి జీవితాలను ఆనందకరంగా మార్చారు. అందుకే బాలసుబ్రమణ్యం మనసు బంగారం అంటుంటారు.

3. ప్రతి ఒక్కరిని చాలా ఆప్యాయంగా పలకరించేవారు. ఎంత ఎదిగినా కూడా దర్పం వంటి లక్షణాలను ఎక్కడ చూపించకుండా తన జీవితాన్ని సాదాసీదాగా గడిపారు.

4. బాలసుబ్రమణ్యం చాలా గౌరవంతో జీవించే వారు. ఒక్కరి చేత కూడా పల్లెత్తు మాట అనిపించుకునే వారు కాదు. నిజాయితీగా నిక్కచ్చిగా తన జీవితాన్ని కొనసాగించిన బాలసుబ్రమణ్యం ఎప్పుడూ కూడా సెన్సాఫ్ హ్యూమర్ ని వదిలి పెట్టలేదు.

5. ఎప్పటికప్పుడు నూతన విషయాలను తెలుసుకుంటూ కుర్రకారు తో పోటీపడేవారు. అలాగే అందరిని ఎంతో ప్రోత్సహించి.. జీవితంలో పైకి ఎదిగే ఎందుకు సహాయం చేసేవారు.


ఈ విధంగా ఎన్నో మంచి లక్షణాలతో తాను ఓ మంచి వ్యక్తిత్వం కలిగిన విజయవంతమైన గాయకులుగా భారత దేశంలోనే కాదు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: