టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది కీర్తి సురేష్. నితిన్ సరసన రంగ్ దే సినిమా లో నటిస్తున్న కీర్తి...దానితో పాటుగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాను కూడా చేస్తుంది .ఆ సినిమానే గుడ్ లక్ సఖి.. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ ఓ గ్రామీణ యువతి గా నటిస్తోంది.


ఇక సోషల్ మీడియాలలో కూడా ఈ మధ్య కీర్తి చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వీడియోలో కీర్తి సురేశ్ జీరో సైజులో స్లిమ్‌గా కనిపించడమే దానికి కారణం.
ఎప్పుడూ బొద్దుగా కనిపించే కీర్తి సురేశ్ అలా సన్నగా అయిపోయేసరికి అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. డౌన్ సమయంలో ఈ అమ్మడు ఆరోగ్యంపై బాగా ఫోకస్ చేసి ఇలా మారిందని అభిమానుల అభిప్రాయం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రను పోషించింది కీర్తి. ఆ చిత్రానికి గాను జాతీయ అవార్డును పొందింది.


తర్వాత మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టింది. అటు మహేష్ తో కూడా కీర్తి సురేష్ నటిస్తోంది. ఐతే ప్రస్తుతం జీరో సైజ్ లుక్ మహేష్ బాబు చిత్రం కోసం అంటూ చెప్పుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి ఈ వార్తల్లో  నిజం ఉందో తెలియదు కానీ.. కీర్తి జీరో సైజ్ లుక్ మాత్రం మహేష్ సర్కారు వారి పాట సినిమా కోసమే అని టాలీవుడ్ కోడై కూస్తుంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏదైనా అధికారికంగా వెల్లడిస్తే కానీ నమ్మలేం అంటున్నారు విశ్లేషకులు.ప్రస్తుతం కీర్తి.. నితిన్ తో కలిసి నటించిన రంగ్ దే సినిమా సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: