తనని నయనతార, త్రిషలతో పోల్చుకుంటుందో ఏమో కాని సోనియా తన దగ్గరకు వస్తున్న మదర్ రోల్స్ గురించి చాలా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. తన దగ్గరకు వచ్చి అలాంటి రోల్స్ చెబుతారు మరి త్రిష, నయనతారలను కూడా అవే రోల్స్ చేయమని అడగొచ్చు కదా అని అంటుంది సోనియా. ఆమె వాదనలో తప్పేమి లేకపోయినా సినిమా పరిశ్రమలో టాలెంట్, లక్ ఈ రెండు ఫ్యాక్టర్స్ బాగా పనిచేస్తాయి. నీలో ఎంత టాలెంట్ ఉన్నా సరే లక్ కలిసి రావాలి.. లక్ ఉన్నా టాలెంట్ చూపించాలి. ఇలా రెండు కలిసి వస్తేనే క్రేజ్ తెచ్చుకుంటారు.
తెలుగులో 7/జి బృందావన కాలనీ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత అదే సినిమా డైరక్టర్ సెల్వ రాఘవన్ ను పెళ్ళాడింది. ఆ తర్వాత ఇద్దరు డైవర్స్ కూడా తీసుకున్నారు. మరి నయనతార, త్రిషలకు ఇంకా పెళ్ళి కాలేదు అందుకే వారికి ఇంకా ఛాన్సులు వస్తున్నయన్న లాజిక్ సోనియా ఎలా మిస్సయిందో.. అంతేకాదు హీరోయిన్ గా ఉన్నప్పుడే క్రేజ్ తెచ్చుకోలేని సోనియా పెళ్ళి తర్వాత పెద్దగా ఛాన్సులు రావన్న విషయాన్ని గుర్తించాలి. ఎవరో సమంత లాంటి ఒకరిద్దరికి తప్ప అలాంటి అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు.