యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కరణ్ జోహార్ ను ఈ సినిమా కి భాగస్వామి కాగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావొచ్చింది.. త్వరలోనే మిగితా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నారు.. .. విజయ్ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి సినిమా తప్పక గుర్తొస్తుంది.. కొన్ని సంవత్సరాలకు గానీ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు రావు , హీరోలు రారు.. అలా ట్రెండ్ సెట్ చేసిన హీరో, సినిమా రెండు ఒకేసారి టాలీవుడ్ కి దొరికారు..ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఆ సినిమా కంటెంట్ అని చెప్పాలి..

ఇదిలా ఉంటె విజయ్ దేవరకొండ ఇటీవలే సుకుమార్ తో ఓ సినిమా ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ, సుకుమార్ ల కలయికలో ఒక క్రేజీ పాన్-ఇండియన్ చిత్రం ప్రకటించడం నిజానికి సంచలనమే అయ్యింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని కేదర్ సెలగంసెట్టి  `ఫాల్కన్ క్రియేషన్స్` బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.. ఇప్పుడు ఆసక్తికర విషయం ఏంటంటే అనుష్క విజయ్ దేవరకొండ తో నటించబోతుంది.. అయితే అది ఈ సినిమా లోనా వేరే సినిమా లోనా అన్నది మాత్రం తెలీదు..

ఇటీవలే డైరెక్ట్ ఓటిటి రిలీజైన నిశ్శబ్దం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుష్క అంచనాలు ఆవిరయ్యాయి. కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేక సోషల్ మీడియాలో, ఆన్ లైన్ రివ్యూలలో ఈ సినిమాపై వెల్లువెత్తిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఓటిటి విడుదల చేసి నిర్మాతలు సేఫ్ అయ్యారు కానీ థియేటర్లలో అయ్యుంటే ఖచ్చితంగా ఇది మొదటి వారానికే తిరుగుటపా అయ్యేదనే స్థాయిలో కామెంట్స్ వచ్చి పడ్డాయి. రెండున్నర ఏళ్ళ గ్యాప్ తర్వాత ఇలాంటి ఫలితం రావడం స్వీటీ అభిమానులకు షాక్ కలిగించేదే. ఈ నేపథ్యంలో స్వీటీ ఇప్పుడు ఆశలన్నీ విజయ్ దేవరకొండ సినిమా పైనే పెట్టుకున్నట్లు తెలుస్తుంది.. మరి ఈ సినిమా అయినా అనుష్క కెరీర్ ని కాపాడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: