గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో మాస్ మహారాజా రవితేజ.. ఇటీవల ఆయన నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..వాటిలో రాజా ది గ్రేట్ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ సినిమా తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా రవితేజకు హిట్ ను అందివ్వలేకపోయాయి.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ప్రయోగాత్మక చిత్రం డిస్కో రాజా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఖర్చులు కూడా రాలేదని ఫిలిం నగర్లో టాక్..


ప్రస్తుతం సినిమా కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన రవితేజ...ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్రాక్’ సినిమా లో నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. గత కొన్ని నెలలుగా చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవి తేజ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇటీవల కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్ ఆగిపోయింది.


దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా
చివరి షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. కాగా లాక్ డౌన్ లో సడలింపులు జరగడంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ మేరకు నిన్న షూటింగ్ ను ప్రారంభించారు. డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది.ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నేర ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ ఆధ్వర్యంలో బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి పాటలను, ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మొత్తానికి ఈ సినిమా హడావిడి చూస్తుంటే సినిమా హిట్ పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి..మరి రవి తేజసినిమా తో ఏ మాత్రం హిట్ ను అందుకుంటాడు చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: