ఓటీటీలకు రావడానికి వర్రీ అయిపోయే భామల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. బీటౌన్ బ్యూటీస్ మాదిరిగానే ఇదొక మాంచి సేలబుల్ ఫ్లాట్ ఫారమ్ గా ఫీలవుతున్నారు. కొత్తగా వస్తోన్న సౌత్ బ్యూటీస్ తో వెబ్ సిరీస్ లు త్వరలో మెరుపులు మెరిపించ బోతున్నాయి.

ఓటీటీలు వచ్చాక వెండితెర, బుల్లితెర, డిజిటల్‌ తెరలకు డిఫరెన్స్ లేకుండా పోయింది. ఉన్నదల్లా ఒక్కటే తెర... ప్రేక్షకులు మెచ్చిన, వాళ్లకు నచ్చిన కంటెంట్ ను మాత్రమే చూపిస్తున్నారు. దీనికోసమని జీ 5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా లు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. ఇందులో నటించే తారలు ట్రెండింగ్‌లో ఉంటున్నారు. కొందరు బ్యూటీస్ అయితే  ఓటీటీ వేదికలలో లెక్కకు మించి వినోదం అందిస్తున్నారు. మరికొంతమంది  ఎప్పుడెప్పుడు అందిద్దామా  అని ఎదురుచూస్తున్నారు.

నిజానికి మొన్నటివరకు ఓటీటీలకు వచ్చి నటించాలంటే చాలామంది తారలు భయపడ్డారు. వన్ప్ ఇటు వస్తే అటు సినిమాలు రావనుకున్నారు.ఐతే హిందీ వెబ్  సిరీస్ ‘లస్ట్‌ స్టోరీస్‌’ అలాంటి అనుమానాలను పటాపంచలు చేసింది. ఇందులో నటించిన కియారా అద్వాణీ, భూమి ఫెడ్నేకర్‌ తర్వాత బాలీవుడ్ లో అగ్ర కథానాయికల స్థాయికి వెళ్లారు.

ఒరిజినల్‌ తెలుగు కంటెంట్‌పై ‘జీ 5’ దృష్టి పెట్టడంతో ఇటు మన తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి.‘ఆహా’ సిరీస్ ల ద్వారా మరికొంతమంది కథానాయికలు ఇటువైపు అడుగులు వేస్తున్నారు.‘కుమారి 21 ఎఫ్‌’ఫేం హెబ్బా పటేల్‌కు మంచి క్రేజ్‌ ఉంది. దీనిని క్యాష్ చేసుకోవడం కోసం ‘మస్తీస్’లో ఆమెకు మంచి అవకాశం వచ్చింది. అలాగే ‘ఆవకాయ్‌ బిర్యానీ’తో వెలుగులోకి వచ్చిన  బిందు మాధవి‘మస్తీస్’తో తెలుగు ప్రజలను పలకరించింది.

టాలీవుడ్ లీడింగ్ బ్యూటీస్ కూడా డిజిటల్ బ్యూటీస్ మారడానికి చూస్తున్నారు.అలాంటివారిలో సమంత, తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తమిళ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీ్‌స్ లో తమన్నా నటించనుంది.ఇక తమన్నా ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్‌ చేయాలని ‘ఆహా’ చర్చలు జరుపుతోంది. సమంతతో ఓ టాక్‌ షో ప్లాన్‌ చేసింది. ఈ రెండూ త్వరలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్లిద్దరి ఓటీటీ అరంగేట్రం గురించి ప్రేక్షకులు వెయిటింగ్‌. వీరనే కాకుండా త్వరలో మరింతమంది హీరోయిన్లు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేసుకోవాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: