ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది బిగ్బాస్ తెలుగు సీజన్ 4. మొదట కాస్త తడబడినప్పటికి ఆ తర్వాత మాత్రం అందరినీ ఆకర్షిస్తూ... టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బిగ్బాస్ తెలుగు సీజన్ కి స్పెషల్ ఎట్రాక్షన్ హోస్ట్ నాగార్జున అన్న విషయం తెలిసిందే. వారంలో రెండు రోజుల పాటు నాగార్జున వచ్చి చేసే సందడి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల కన్ను మొత్తం బిగ్ బాస్ హౌస్ పైనే ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సరికొత్త లవ్ స్టోరీ లు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి.



 అయితే ఎన్టీఆర్ తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా బాగా సక్సెస్ అయ్యాడు నాగార్జున. మొదట నాగార్జున ఎలా బిగ్ బాస్ షో ని హోస్ట్ చేస్తాడు అని అనుకున్నప్పటికీ ఎంతో విజయవంతంగా బిగ్ బాస్ మూడవ సీజన్  హోస్టు చేశాడు. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా నాగార్జున చరిష్మా తో టాప్ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బిగ్ బాస్. ప్రతివారం నాగార్జున వచ్చి చేసే సందడి అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జున.. త్వరలో బిగ్ బాస్ కి దూరం అవ్వబోతున్నాడా  అంటే అవును అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.



 ఇటీవలే కొత్త సినిమా వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్లిన నాగార్జున ఇంకా తిరిగి రాలేదట. షెడ్యూల్  లో భాగంగా కొన్ని వారాలపాటు థాయిలాండ్ లోనే ఉండే అవకాశం ఉందట. దీంతో నాగార్జున కొన్ని ఎపిసోడ్ లో  కనిపించకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఆయన స్థానంలో వేరే వారిని తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుందట బిగ్ బాస్ యాజమాన్యం. దీనికోసం ఎన్టీఆర్ నాని సహా నాగ చైతన్యను కూడా సంప్రదించారట. ఇకవారు  షూటింగ్ తో  బిజీగా ఉండడంతో మరోసారి రమ్యకృష్ణ వద్దకు ఈ అవకాశం వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. గత సీజన్లో కొన్ని ఎపిసోడ్లు రమ్యకృష్ణ హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే. దీంతో రమ్యకృష్ణ హోస్ట్ గా రాబోతుంది అని టాక్  వినిపిస్తుండగా... మరోవైపు ఎలాగోలా వచ్చి  బిగ్బాస్ షూటింగ్ పూర్తి చేయాలని నాగార్జున భావిస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: