టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి న ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ఎక్కడ ఉందో అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోయాడు.. దేశంలో ఎ హీరో కి దక్కని స్టార్ డం ఇప్పుడు ప్రభాస్ సొంతం.. అలాంటి ప్రభాస్ తన చిత్రాలలో అందరు బాలీవుడ్ యాక్టర్లను పెట్టుకుని అసలు ప్రభాస్ బాలీవుడ్ యాక్టరా.. టాలీవుడ్ యాక్టరా అని అభిమానులు సందేహాలు లేవనెత్తుతున్నారు..ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ప్రస్తుతం ప్యారిస్ లో షూటింగ్ జరుపుకుంటుండగా సంక్రాంతి కి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ ప్రభాస్ చూస్తున్నాడు..

సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లో హీరోయిన్ గా దీపికా పడుకునే ని ఖరారు చేయగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ రెడీ గా ఉంది.. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ కూడా నటిస్తున్నట్లు ఇటీవలే సినిమా టీం నుండి అధికారిక ప్రకటన వచ్చేసింది.. దీంతో  తెలుగు డైరెక్టర్ అయిన నాగ శ్విన్  కూడా తన సినిమా లో పక్కా బాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నాడని నాగ్ అశ్విన్ చేతలను బట్టి తెలుస్తుంది.

నాగ్ అశ్విన్ సౌత్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ నే ప్రభాస్ సినిమాలో హైలెట్ చేస్తున్నాడు అంటే.. నాగ్ అశ్విన్ కూడా ఆదిపురుష్ దర్శకుడు ఓం రనౌత్ లాగా హిందీనే టార్గెట్ చేస్తున్నాడని ఫిక్స్ అవ్వొచ్చు. మరి సాహో, రాధేశ్యాం ని ఎక్కువగా సౌత్ కి నచ్చేలా చేసిన ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని మాత్రం హిందీ ప్రేక్షకులు దగ్గరగా తియ్యబోతున్నాడని అర్ధమైపోయింది.. ఈ నేపథ్యం లో టాలీవుడ్ పెద్దల ఇక్కడి నటులకోసం ఏం చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: