నాగార్జున ఈ విధంగా ఫైర్ అవడంపై హౌజ్ మేట్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మూడవ వారంలో జరిగిన ఉక్కు హృదయం టాస్క్ లోనే సోహెల్, మెహబూబ్ కాస్త అతి చేయగా మొదటిసారి కాబట్టి లైట్ తీసుకుని సమర్ధించిన నాగ్ ఈసారి మాత్రం ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. బిబి హోటల్ టాస్క్ లో భాగంగా హోటల్ సిబ్బందికి, గెస్టులకు మధ్య జరిగిన వివాదంలో నాగార్జున ఫైర్ అయ్యాడు.
ప్రోమో చూస్తేనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ సూపర్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌజ్ నుండి గంగవ్వ బయటకు వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వారం నామినేషన్స్ ద్వారా కూడా మరో హౌజ్ మేట్ ఎలిమినేట్ అవుతారా లేరా అన్నది చూడాలి.