బిగ్ బాస్ హౌజ్ లో గంగవ్వ జర్నీ ముగిసింది. మొదటి వారం బాగున్నా రెండో వారం సిక్ అవడం ఆ తర్వాత మళ్లీ హెల్త్ బాగానే ఉండటంతో హౌజ్ లో కొనసాగింది. ఇక ఐదవ వారం లో మళ్లీ ఆమె హెల్త్ కండీషన్ బాగా లేకపోవడంతో ఆమెను హౌజ్ నుండి పంపించాలని నిర్ణయించారు. బిగ్ బాస్ హౌజ్ నుండి గంగవ్వ బయటకు వచ్చేసింది. హౌజ్ మేట్స్ అందరిని జాగ్రత్త ఉండమని చెప్పి వారందరు ఆమెను క్లాప్స్ కొడుతూ హౌజ్ నుండి బయటకు పంపించారు. ఇక నాగార్జునతో కలిసి స్టేజ్ మీద ఒక్కొక్క హౌజ్ మేట్ గురించి చెప్పింది.

హౌజ్ లో తన జర్నీ చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. నాగార్జున కూడా వాటే  వండర్ఫుల్ జర్నీ అన్నారు. ఇక ఆమె వెళ్లేప్పుడు ఏదైతే సాధించాలని అనుకుందో అది సాధించుకుంది గంగవ్వ. బిగ్ బాస్ విన్నర్ అయ్యి సొంత ఇల్లు కట్టుకుంటానని చెప్పింది గంగవ్వ. అయితే నాగార్జున నీ ఇల్లు కట్టిస్తాం అంటూ హామీ ఇచ్చేశాడు. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్లు గంగవ్వ్వ ఇల్లు కట్టించేస్తాం అంటూ నాగార్జున చెప్పారు. 60 ఏళ్ళ వయసులో గంగవ్వ ఇంటి కోసం బిగ్ బాస్ హౌజ్ లో ఐదు వారాలు తన ఆట తీరుతో ఆకట్టుకుంది.  

రెండో వారం హెల్త్ ప్రాబ్లం వల్ల హౌజ్ నుండి వెళ్తుందేమో అన్న డౌట్ వచ్చినా ఆమె మళ్ళీ కోలుకుంది. అయితే బిగ్ బాస్ తో గంగవ్వ ఐదు వారాల అగ్రిమెంట్ మాత్రమే చేసుకుందని.. ఐదు వారాలు ఉంటే తనకు ఇల్లు కట్టిస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పినట్టు టాక్. ఏదైతేనేం గంగవ్వ పడిన ఈ నెల రోజుల కష్టానికి ఇల్లు కానుకగా రాబోతుంది. నాగ్ అష్యురెన్స్ ఇచ్చారు కాబట్టి త్వరలోనే గంగవ్వ ఇంటికి సంబందించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: