అయితే ఇటీవల నిహారిక కు ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.. కాబోయేవాడితో దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఇటీవలే తన పెళ్లి శుభవార్త చెప్పిన నిహారిక.. 'మిస్'ని కొట్టివేస్తూ 'మిస్సెస్ నిహా' అంటూ తొలి పోస్ట్ పెట్టి కాబోయే భర్త డీటెయిల్స్ చెప్పింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. రెండు నెలల క్రితం చైతన్య తో పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. మరి కొద్దిరోజుల్లో పెళ్లి వేడుకలు జరగనుంది..
ఇది ఇలా ఉండగా ఇటీవల లాక్ డౌన్ కఠిన తరంగా ఉండటంతో ఇంటికే పరిమితమైన నిహా ఇప్పుడు ఎంజాయ్ చేయాలనుకొని ఫిక్స్ అయ్యింది. కుటుంబ సభ్యులతో నిశ్చితార్థం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపు లు చేశారు. దీంతో రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరిగాయి...ఈ మేరకు నిహా ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీని గ్రాండ్ గా ఇవ్వాలనుకుంది..అందుకే ఇప్పుడు తన స్నేహితులతో గోవా ట్రిప్ వేసి అక్కడే చిల్ అవుతోందని టాక్. అయితే ఈ గోవా ట్రిప్‌కి నిహారిక భర్త చైతన్య కూడా వెళ్లడా? లేక కేవలం స్నేహితురాళ్ళతో ఆమె టూర్ వేసిందా అనేది సస్పెన్స్ అని చెప్పాలి.ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..