టాలీవుడ్ స్టార్ హీరో.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు తెలుగులోనే కాదు తమిళ్ లో క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి మహిమతో హిందీలో సినిమా చేయకపోయినా విజయ్ కు క్రేజ్ ఏర్పడటం విశేషం. దీంతో విజయ్ ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతోంది. రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమకాలీన రాజకీయాల గురించి తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. చాలామంది విజయ్ అభిప్రాయంపై కౌంటర్లు వేశారు. ఓ బాలీవుడ్ నటుడు కూడా విజయ్ పై సెటైర్లు వేశాడు. దీంతో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
గుల్షన్ దేవయ్య అనే బాలీవుడ్ నటుడు విజయ్ వ్యాఖ్యలపై కామెంట్ చేశాడు. ‘తలలో బాగా ఒత్తిడి పెరిగినట్టుంది. ఒత్తడి తగ్గేందుకు ఉపయోగపడే ఓ హెయిర్ కట్ ను సూచిస్తా’ అని సోషల్ మీడియా వేదికగా సెటైర్ వేశాడు. ఈ సెటైర్ కు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రెస్పాండ్ అయ్యాడు. ‘తలలో ఒత్తిడి కాదు. తెలివి ఉన్నవారు.. ముందు ఎదుటివారు ఏం చెప్పారో అర్ధం చేసుకుని మాట్లాడతారు. తెలీకుండా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయరు’ అని కౌంటర్ ఇచ్చాడు. ఆనంద్ ఇచ్చిన కౌంటర్ కు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాల్లోకి వెళ్తే నేను డిక్టేటర్ గా ఉంటాను. అందరికీ ఓట్ వేసే హక్కు ఉండకూడదు. డబ్బు, మందుకు ఓటు వేయడాన్ని నేను వ్యతిరేకిస్తాను. కొందరు ఓటు ఎందుకు వేస్తున్నారో.. ఎవరికి వేస్తున్నారో వారికే తెలీదు. డబ్బున్న వాళ్లు మాత్రమే ఓటు వేయాలని నేను అనడం లేదు.. మధ్యతరగతి వారు కూడా ఓటు వేసే ముందు ఆలోచించాలి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు విజయ్ దేవరకొండ. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: