సినీ పరిశ్రమలో మార్కెట్ ఉన్న సీనియర్ హీరోలనే  కాదు... క్రేజ్ ఉన్న ట్రెండీ హీరోలకు  కూడా పారితోషకాలు గట్టిగానే ముడుతుంటాయి. అందులో హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి డిమాండ్ ఉన్న టాప్ బ్యూటీస్ కు  కోటి రూపాయలు మించి ఇవ్వడానికి నిర్మాతలు ఆపసోపాలు పడిపోతుంటారు. అదే ఓ చోటా హీరోకు మాత్రం కోట్లకు కోట్లు ఇవ్వడానికి వెనకాడరు. చివరకు ఆ చోటా హీరో సినిమాలో కూడా ఐటమ్ సాండ్ పేరు చెప్పి ఓ భామతో చిందు  వేయందే బయ్యర్లు ఆ సినిమాను కొనలేని పరిస్థితి. మరి అలాంటి సమయంలో నటీమణులకు రెమ్యునిరేషన్ల మ్యాటర్లో హీరోల మాదిరిగా కాకపోయినా కాస్త దగ్గరిగా అయినా  ఎందుకు ఇవ్వరు. ఇక్కడ సినిమా చూపించేది హీరోలే కాదు... హీరోయిన్లు కూడా చూపిస్తున్నారనే విషయం ఎన్నో సార్లు ఫ్రూవ్ అయ్యింది.ఫిల్మీ క్రిటిక్స్ చెబుతున్నదాని ప్రకారం ...శృతిహాసన్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో అస్సలు ఎక్కడా తప్పులేదు.

 టాలీవుడ్ లో మొన్న కాక నిన్న వచ్చిన కుర్ర హీరోలు అప్పుడే 2 నుంచి 3కోట్ల రెమ్యునిరేషన్లకు ఎదిగిపోయారు. ఎప్పటి నుంచో లీడింగ్ బ్యూటీలుగా ఉంటున్నవారు ఇప్పటికీ చోటా హీరోలకు ఇచ్చిన మార్క్ ను కూడా కనీసం అందుకోలేకపోతున్నారు. ఇక్కడ నటీమణులు నిర్మాతలను డిమాండ్ చేసి తీసుకోలేక పోతున్నారా లేక నిర్మాతలే హీరోయిన్లకు అంత ఎందుకుఅనుకుంటున్నారా అనేది తెలియడం లేదు. తాజాగా అడవి శేషు, శ్రీవిష్ణు లాంటి యంగ్ హీరోలనే తీసుకుంటే...వీరి అప్పుడే 2 నుంచి 3కోట్లకు ఎదగడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. కాకపోతే వీరి సినిమాల వసూళ్లు , కంటెంట్ కాస్త బెటర్ గా ఉండడం వీరికి ఈ లెక్క వచ్చేలా చేసింది. మరి వీరి తరహాలోనే కాస్త గట్టిగానే వసూళ్లను రాబడుతోన్న లావణ్య త్రిపాటి, అనుపమ, అను ఇమాన్యుయల్ లాంటి హీరోయిన్లకు జస్ట్ 25నుంచి 40లక్షల వరకే ఇస్తున్నారు. ఇంతకుమించిన లెక్కను ఈ  హీరోయిన్లకు ఎందుకు ఇవ్వడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: