ప్రస్తుతం బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతు  బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తుంది బిగ్బాస్ సీజన్ 4 తెలుగు రియాలిటీ షో. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీ లు... ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు.. అంతే కాకుండా కాంట్రవర్సీలు గొడవలు కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి . ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో కెమెరాల న్ని  ఎక్కువగా మోనాల్ అఖిల్  పైనే ఎక్కువగా చూపిస్తూ ఉండటం గమనార్హం. ఇక బిగ్బాస్ తెలుగు సీజన్ 4 లో ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ప్రేక్షకులందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఒకరిపై ఒకరు కోపాలు ప్రేమగా మాట్లాడు కోవడాలు తరచూ హగ్గులు  అనేవి కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.



 ఇక ప్రస్తుతం హౌస్లో మోనాల్ అఖిల్  మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై బయట భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం టీవీ చూస్తున్న ప్రేక్షకులను  ఆకర్షించి ఓట్లు రాబట్టడానికి మాత్రమే ఇలా చేస్తున్నారని కొంతమంది... మోనాల్ అఖిల్ మధ్య  మంచి స్నేహం కుదిరింది అని మరి కొంతమంది ఇలా ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే మోనాల్ అనారోగ్యానికి గురికావడంతో అఖిల్ తెగ ఫీల్ అయిపోయాడు. డాక్టర్లు మోనాల్ కి సెలైన్ వేసినట్లు బిగ్బాస్ తెలిపిన విషయం తెలిసిందే.



 ఇక ఈ క్రమంలోనే మోనాల్ దగ్గరికి వచ్చిన అఖిల్ కొంత భావోద్వేగానికి గురి అయ్యాడు. ఈ క్రమంలోనే గుడ్ మార్నింగ్ చెబుతూ మోనాల్ అఖిల్ ని గట్టిగా హత్తుకుంది. గతంలో అఖిల్ నువ్వు నాకు మెడిసిన్ అంటూ మోనాల్ చెప్పిన విషయం తెలిసిందే. అనారోగ్యం బారినపడిన మోనాల్ అలాంటి మెడిసిన్ కోసమే అఖిల్ ను హాగ్  చేసుకున్నట్లు భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇటీవలే హౌస్ నుంచి బయటకు వచ్చిన జోర్దార్ సుజాత మోనాల్ అఖిల్ అభిజిత్ లది  ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఏకకాలంలో ఇద్దరితో రొమాన్స్ చేస్తుంది అంటూ  సంచలనానికి తెర లేపింది. ఏదేమైనా ప్రస్తుతం బిగ్బాస్ కెమెరాల కన్ను  మొత్తం మోనాల్ అఖిల్  పైనే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: