కరోనా పరిస్థితులతో సినిమాల బిజినెస్ సినిమాల కలక్షన్స్ భవిష్యత్ లో ఏవిధంగా ఉంటాయో అని భయపడుతున్న ఫిలిం ఇండస్ట్రీ వర్గాలకు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకుండానే ఈమూవీ అనూహ్యమైన రీతిలో భారీ బిజినెస్ కు శ్రీకారం చుట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ ను స్టార్ నెట్ వర్క్ 200 కోట్లకు కొనుక్కునే దిశగా చర్చలు జరుపుతూ త్వరలో ఎగ్రిమెంట్ చేసుకునే దిశలో అడుగులు వేస్తున్నట్లు ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక ఆశక్తికర కధనాన్ని ప్రచురించింది. స్టార్ నెట్ వర్క సంబంధించి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు దక్షిణాది రాష్ట్రాలలో మరింతమంది చందాదార్లు పెంచుకోవడానికి ఈ వ్యూహాన్ని స్టార్ నెట్ వర్క్ అనుసరించినట్లు అంచనాలు వస్తున్నాయి.
స్టార్ నెట్ వర్క్ ఇచ్చిన ఆఫర్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన ఏరియా బిజినెస్ మరింత ఊపు అందుకుని ఈమూవీ విడుదల కాకుండానే 800 వందల కోట్ల పై చిలుకు బిజినెస్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. కరోనా సమస్యలు వల్ల ఫిలిం ఇండస్ట్రీ దేశ వ్యాప్తంగా దెబ్బతిన్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇలాంటి భారీ ఆఫర్ రావడం ఈమూవీకి జాతీయ స్థాయిలో ఉన్న మ్యానియాను సూచిస్తోంది.
ఈనెల 22వ తారీఖున ఈమూవీలోని జూనియర్ పాత్రకు సంబంధించిన టీజర్ కొమరం భీమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న పరిస్థితులలో ఆ టీజర్ కు వచ్చే స్పందన జాతీయ స్థాయిలో ఒక ట్రెండింగ్ న్యూస్ గా మారుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ కథ స్వాతంత్రోద్యమ నేపద్యంలోఉండదు కేవలం ఒక ఊహ మాత్రమే అంటూ లీకులు ఇస్తున్న రాజమౌళి ఈమూవీ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అన్న సంకేతాలు ఇస్తున్నాడు..