ఈ వెబ్ సిరీస్ ఒక ప్రత్యేక కథనం తో ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రీమ్ క్యాచర్స్ బ్యానర్‌పై ప్రసన్న, వరలక్ష్మీ శరత్ కుమార్, జయప్రకాశ్, రోహిని, కిషోర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందింది.భరత్ నీలకంఠం, శివ అనంత్, సర్జన్‌లు ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 16న ఆహా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఈ సంధర్బంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికించిన కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ తో పాటుగా ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురయ్యారు.సినిమాలలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఇంత ఖాళీ గా ఉన్నాను అంటే అర్థం చేసుకోండి.
అలాంటి వారందరి మా వెబ్ సిరీస్ రిలాక్స్ అయ్యేలా చేస్తుందని భావిస్తున్నాను.. ఈ స్క్రిప్ట్ అంత బాగుంటుంది. నేను ఇప్పటి వరకు ఇటువంటి పాత్ర చేయలేదు. చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను రొటీన్ పాత్రలు చేసుకువచ్చాను. బోల్డ్‌గా, విలన్‌గా ఇలా చేశాను.. కానీ ఇలాంటి పాత్ర అసలు చేయలేదు. చాలా విభిన్నంగా నా పాత్ర ఉంటుంది. ఇందులో కిషోర్ కు నాకు మద్య సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను ఆకర్షించడానికి థియేటరా, ఓటీటీనా.. అనేది ప్రేక్షకులు పట్టించుకోరు. కథ నచ్చితే అది బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుంది.. మా వెబ్ సిరీస్ కూడా జనాలకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.. ఈరోజు విడుదల అవుతుంది. మరి ఎలా ఉందో మీరే చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.