ఇక ఈ సినిమా తర్వాత నాగ శౌర్య రెండు క్రేజీ ప్రాజెక్టులను ఫిక్స్ చేసుకున్నాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తుండగా మరోటి సొంత ప్రొడక్షన్ లో చేస్తున్నాడు. అలా ఎలా, లవర్స్ సినిమాలను డైరెక్ట్ చేసిన అనీష్ కృష్ణతో నాగ శౌర్య కొత్త సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేటెస్ట్ గా వచ్చింది.
నాగ శౌర్య ఈ సినిమాలో డిఫరెంట్ క్యారక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. సొంత ప్రొడక్షన్ లో ఎదురుదెబ్బలు తగులుతున్నా సరే నాగ శౌర్య మాత్రం తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తప్పకుండా ఈసారి నాగ శౌర్య ఎఫర్ట్ కు మంచి ఫలితం వచ్చేలా ఉందని చెప్పొచ్చు. యువ హీరోల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకునే సత్తా ఉన్నా సరే కథల ఎంపికలో ట్రాక్ తప్పుతున్నాడు. మరి నాగ శౌర్య ఈ అటెంప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.