ఇలియానా సక్సెస్‌లో ఉన్నప్పుడు బోల్డంత కలరింగ్ ఇచ్చింది. కుర్రాళ్లలో క్రేజ్ చూసుకుని సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ, టాలీవుడ్‌లో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ హీరోయిన్‌గా నిలిచింది. అలాంటి హీరోయిన్‌కి ఇప్పుడు సినిమాలు రావడమే కష్టంగా ఉంది. కెరీర్ ముందుకెళ్లడం పెద్ద సవాల్‌లా తయారైంది. దీంతో బోల్డన్ని మెట్లు దిగి నేలమీదకి వచ్చేస్తోంది ఇల్లీ.
ఇలియానా టాలీవుడ్ టాప్ ప్లేస్‌లో ఉన్నప్పుడు 'బర్ఫీ'తో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. ఇక ముంబయి వెళ్లిపోయాక టాలీవుడ్‌ని పక్కనపెట్టేసి అక్కడే వరుస సినిమాలు చేసుకుంది. అయితే తెలుగు ఇండస్ట్రీని పక్కనపెట్టి మరీ బీటౌన్‌కే అంకితమైపోయినా ఇలియానాకి అక్కడ సూపర్ స్టార్డమ్ రాలేదు. దీనికితోడు బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో బ్రేకప్ అయ్యాక ఫ్యాటీలా మారిపోయింది బెల్లీ బ్యూటీ.
ఇలియానా బరువు చూసి వచ్చే ఒకటి రెండు సినిమాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఇల్లీ కెరీర్ క్లైమాక్స్‌కి చేరిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డానికి బరవుతో పాటు రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటోందట ఇలియానా. రణ్‌దీప్ హుడాతో కలిసి చెయ్యబోయే 'అన్ ఫెయిర్ అండ్ లవ్‌లీ' సినిమాకి రెమ్యూనరేషన్ తగ్గించుకుందని ప్రచారం జరుగుతోంది.
ఇలియానా కొట్టిన ఫోజులు ఫలించలేదు. ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆఫర్స్ కోసం ఇల్లీబేబీ పడరాని పాట్లు పడింది. ఈ బ్యూటీ పేరెత్తగానే హీరోలు మొహం చాటేస్తున్నారు.
ఇంకేం చేసేది లేక ఒక్క ఛాన్స్ అంటూ వెంటపడుతోందీ ఇల్లీ బేబీ.