ఈ నేపథ్యంలో యాంకర్ లాస్య తన జీవితంలో జరిగిన మంచి, చెడులను గురించి బయటపెట్టి ఎమోషన్ అయ్యింది.మంజునాథ్ ను రెండు సార్లు పెళ్ళి చేసుకున్నాట్లు తెలిపింది. మొదటి సారి చేసుకున్నప్పుడు అందరూ తనను అసహ్యించుకోవడం తో పాటుగా దూరం పెట్టినట్లు తెలిపింది.పెళ్లయ్యాక ఏడేళ్లకు మరోసారి కుటుంబ సభ్యుల సమక్షంలో తన భర్తనే రెండోసారి పెళ్లి చేసుకున్నానని చెబుతూ ఓపెన్ అయిందట..తన తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటిసారి అప్పు చేశానని, లక్షా 50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అందరి దగ్గరా అడిగి ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది లాస్య..
ఆ డబ్బుకోసం చాలా మందిని అడిగాను ఎవరు ఇవ్వలేదు.. చివరికి నా భర్త ఆ ఎమౌంట్ ను సర్దారు.దాంతో ఇప్పుడు వారందరి తనని కొడుకు లాగా అభిమానిస్తున్నారు.తన తండ్రి ఆయన్ను ఓ కొడుకుగా ట్రీట్ చేశారని లాస్య చెప్పింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల తమను దూరం పెట్టిన తల్లిదండ్రులు అలా దగ్గరై ఇప్పుడు తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటున్నారని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఓర్పు అమ్మ దగ్గర, కోపం నాన్న దగ్గర నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ విషయం ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది..