ఈ మూవీలో జూనియర్ నటిస్తున్న కొమరం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ ఈ వీడియో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వీడియోలో ఎన్టీఆర్ అనేక గెటప్ లలో కనిస్తాడని తెలుస్తోంది. ఒక సగటు మనిషి స్థాయి నుండి ఉద్యమ కారుడుగా కొమరం భీమ్ మారిన విషయాన్ని రకరకాల గెటప్స్ లో ఈ వీడియోలో చూపిస్తారని టాక్.
ఈ వీడియో చివరికి వచ్చేసరికి జూనియర్ తలపాగా పెట్టుకున్న గెటప్ తో ముగిస్తుంది అన్న లీకులు వస్తున్నాయి. ఈ టీజర్ ప్రారంభంలో ఎన్టీఆర్ షరాయి లాల్చీ తో కనపడుతూ అక్కడ నుండి రకరకాల గెటప్ లకు మారిపోతోడట. స్వాతంత్రోద్యమ చరిత్ర కాకుండా ఆ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని ఒక ఊహతో అల్లబడిన కథ ఎలా ఉండబోతోంది అన్న సంకేతాలు ఇచ్చే విధంగా ఈ టీజర్ ఉంటుందని అంటున్నారు.
ఈ టీజర్ క్రియేట్ చేసే రికార్డులను బట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. కరోనా పరిస్థితులు తరువాత తిరిగి సినిమాలకు పూర్వపు రికార్డు కలక్షన్స్ రావడం అసాధ్యం అన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో టాలీవుడ్ ఇండస్ట్రీ భవిష్యత్ ను శాసించే మూవీగా ‘ఆర్ ఆర్ ఆర్’ మారింది. ఈమూవీ విడుదలయ్యాక వచ్చే ఫలితం బట్టి ఇండస్ట్రీలో మరిన్ని భారీ సినిమాలు నిర్మాణం అవుతాయా లేదా అన్న విషయం తేలిపోతుంది..