సుశాంత్ చనిపోవడానికి కారణం డ్రగ్స్ అని, ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నారని కొందరి పేర్లు బయట పెట్టింది. దాంతో ఈమె పై అందరూ మండి పడ్డారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులతో పాటుగా,ప్రభుత్వం పై కూడా లేని పోని ఆరోపణలు చేసింది.ఈ విషయం పై స్పందించిన ప్రభుత్వం ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. బాలీవుడ్ అంతా డ్రగ్స్ మురికితో పేరుకుపోయిందని, బాలీవుడ్‌లో డ్రగ్స్ కంపు లేని పార్టీ ఒక్కటి కూడా ఉండదనే ఆరోపణలు గుప్పించిన ఆమె.. సుశాంత్ కేసు విషయమై మహారాష్ట్ర సర్కారుతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరు పెట్టుకుంది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా పోల్చుతూ కామెంట్స్ చేయడంతో రచ్చ మొదలై చాలా దూరం వెళ్లింది.
ఈ మేరకు తాజాగా ఆమె తీరును తప్పుబడుతూ ఓ కాస్టింగ్ డైరెక్టర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు.పోలీసులను బాబర్స్ అని ఆమె గతంలో చాలా సార్లు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ సోషల్ మీడియా లో తీవ్ర విమర్శలు చేసింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఆమెను బహిష్కరించాలని ఆయ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ఫిర్యాదు పరిశీలించి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించడంతో ముంబై పోలీసులు వారిద్దరిపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎప్పుడు చిన్న విషయానికి నోరు పారేసుకున్న ఈ అమ్మడు ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ తలైవి సినిమాలో నటిస్తుంది. షూటింగ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది.