అభిమానులు అందరూ భయంతో వణికిపోతునే రాఘవ లారెన్స్ సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మొదట దర్శకుడిగా ముని అనే హారర్ సినిమాలు తెరకెక్కించిన రాఘవ లారెన్స్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ముని సినిమాకి సీక్వెల్ చేస్తూనే వస్తున్నాడు. ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని తెరమీదికి తెచ్చి ప్రేక్షకులందరినీ భయపెట్టి సూపర్ డూపర్ హిట్లు సొంతం చేసుకుంటున్నాడు రాఘవ లారెన్స్ ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
హిజ్రాల గొప్పదనాన్ని చెబుతూనే సూపర్ హారర్ కామెడీ సినిమాని తెరకెక్కించారు రాఘవ లారెన్స్. అయితే తనను ఒకసారి ట్రాన్స్ జెండర్ లు కలిసి వారి బాధ చెప్పుకోవడం తోనే వారి బాధలను కాంచన సినిమా లో పెట్టాను అంటూ రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు. తన కాంచన సినిమాకి ట్రాన్స్జెండర్ ల వర్గం నుంచి ఎంతో మంచి స్పందన వచ్చింది అంటూ తెలిపాడు. ఇక కాంచన హిందీ రీమేక్ సినిమాగా వస్తున్న లక్ష్మీ బాంబ్ అనే సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను అంటూ రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా నవంబర్ 9న ఓటిటీలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.