ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి..... ఓ పౌరాణిక సినిమాను డైరెక్ట్ చేయాలనే కోరికతో అప్పట్లో ‘నర్తనశాల’ అనే సినిమాను మొదలుపెట్టారు
నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో ఆయన అర్జునుడి వేషం వేశారు. ద్రౌపదిగా సౌందర్యని తీసుకోగా.. భీముడిగా
శ్రీహరి, ధర్మరాజుగా
శరత్ బాబులను తీసుకొని కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కానీ ఊహించని విధంగా
సౌందర్య హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అలా ఆగిపోయిన సినిమాను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేశారు బాలకృష్ణ.
దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. దాదాపు 17 నిమిషాల నిడివితో ఉన్న సన్నివేశాలను ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ ఎన్బీకే
థియేటర్ లో శ్రేయాస్ ఈటీ ద్వారా
అక్టోబర్ 24న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా
సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాను ఉచితంగా చూసే ఛాన్స్ లేదు. టికెట్ కొనాల్సిందేనట. టికెట్ ధరని యాభై రూపాయలుగా నిర్ణయించినట్లు టాక్. అయితే
బాలకృష్ణ అభిమానులకు ఓ ఆఫర్ ఇవ్వబోతున్నారు.

ఈ
సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని
బాలకృష్ణ భావిస్తున్నారు. అందుకే తన అభిమానులను ఇందులో భాగస్వాములుగా చేయాలనుకుంటున్నారు. సాధారణం ప్రేక్షకులకు యాభై రూపాయలుగా నిర్ణయించగా..
బాలయ్య అభిమాని అయితే టికెట్ ని ఎంతకైనా కొనొచ్చు. కొంతమంది అభిమానులు ‘నర్తనశాల’ టికెట్ ని రూ.10 లక్షలకు కొనాలని నిర్ణయించారని తెలుస్తోంది. వాళ్ల వివరాలను
బాలయ్య ప్రకటించబోతున్నారు.
ప్రస్తుతం
బాలకృష్ణ తనకు
సింహ,
లెజెండ్ లాంటి
బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.
ఇలాంటి మరిన్ని
మూవీ అప్ డేట్స్ కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..