"బాహుబలి'తో రాజమౌళి పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోతే, ప్రభాస్‌కి పాన్ ఇండియన్ హీరో అనే ఇమేజ్ వచ్చింది. అయితే ఒకే సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న వీళ్లిద్దరు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారుతున్నారు. ప్రమోషన్స్‌లో ఒకరిని మించి మరొకరు అన్నట్లు పోటీపడుతున్నారు.
రాజమౌళి డైరెక్షన్‌లో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ "ట్రిపుల్ ఆర్'. ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి ప్రతీ మూమెంట్‌ని పర్ఫెక్ట్‌గా వాడేస్తున్నాడు జక్కన్న. చరణ్ బర్త్‌డేకి భీమ్ ఫర్ రామరాజు అని టీజర్ రిలీజ్ చేస్తే, ఇప్పుడు కొమరం భీమ్ జయంతినాడు, "ట్రిపుల్ ఆర్' భీమ్ టీజర్ రిలీజ్ చేస్తున్నాడు. ఇక గురువారం రిలీజ్ కాబోతోయే ఈ రామరాజు ఫర్ భీమ్ టీజర్‌కి ఒక ప్రీ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
హీరోల బర్త్‌డేలే కాదు, రాజమౌళి బర్త్‌డేని కూడా "ట్రిపుల్ ఆర్' ప్రమోషన్‌కి వాడేశారు. కంప్లైంట్స్ ఆన్ రాజమౌళి అని ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇలాంటి స్ట్రాటజీస్‌తో "ట్రిపుల్ ఆర్'ని ఎప్పుడూ జనాల్లో ఉండేలా చూసుకుంటున్నాడు రాజమౌళి.
"ట్రిపుల్ ఆర్'తోపాటు అంతే బజ్‌తో మొదలైన మరో పాన్ ఇండియన్ మూవీ "రాధేశ్యామ్'. అయితే ఈ సినిమాని రాజమౌళి రేంజ్‌లో ప్రమోట్ చెయ్యట్లేదని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. మరి ఈ మాటలు ప్రభాస్ వరకు చేరాయో ఏమో గానీ, ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది "రాధేశ్యామ్'. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్‌డేకి మోషన్ పోస్టర్ అనౌన్స్ చేసింది టీమ్. అలాగే డార్లింగ్ బర్త్‌డే కంటే రెండు రోజుల ముందే ప్రభాస్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.