1980 దశకం లో దూరదర్శన్ లో చిత్రలహరిలో ఒక 'బృందావనం సోయగం..' అనే స్విమ్మింగ్ పూల్ పాటని గుర్తు చేసుకుంటే నిరోష ఎవరో తెలుస్తుంది. ఆమె స్ట్రైట్ సినిమాలు అయినా, బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారి, చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇది ఇలా ఉండగా నిరోషా ప్రముఖ తమిళ దర్శకుడు దేవరాజ్ దర్శకత్వంలో 'సింధూరపూవే 'అనే తమిళ చిత్రాన్ని తెలుగు లోకి సింధూరపువ్వు గా అనువదించారు. ఈ విషయం మనకి తెలుసు. అలానే మంచి హిట్ కూడా ఈచిత్రం అందుకుంది. సింధూర పువ్వా..నీవే చిందించరావా.. పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే...? హీరోయిన్ ఎంపిక లో భాగంగా రాధిక చెల్లెల్ని నిరోషని దర్శకుడు దేవరాజు సెలెక్ట్ చేసి..... ఫోటోలోని నిరోషా ను, రాంకీ చూపించినప్పుడు నిరోష ఫోటో ని పట్టుకొని ఏంటి పని మనిషిలా ఉందని అన్నారు. అలా రాంకీ నిరోష కలిసి నటించిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. తమిళంలో 7 శతదినోత్సవ చిత్రాల్లో కలిసి నటించారు. అలానే బాగా అర్ధం చేసుకుని ఒకటయ్యారు వీరు. ఈ మధ్య కాలంలో రాంకీ rx100 చిత్రం లో నటించారు.